చిదంబరం కేసులో ట్విస్ట్.. ఈడీ అధికారి బదిలీ

  • ఈడీ అధికారి రాకేశ్ అహూజా బదిలీ
  • ఢిల్లీ పోలీసు విభాగానికి ట్రాన్స్ ఫర్
  • అహూజా డిప్యుటేషన్ కాలం ముగిసిందన్న ఈడీ
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నిందితుడిగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారి రాకేశ్ అహూజా బదిలీ అయ్యారు. ఢిల్లీ పోలీస్ విభాగంలోకి ఆయనను బదిలీ చేశారు. చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఈ బదిలీ జరగడం చర్చనీయాంశమైంది. మరోవైపు, ఈడీ డైరెక్టరేట్ లో రాకేశ్ అహూజా డిప్యుటేషన్ కాలం మూడు వారాల క్రితమే ముగిసిందని ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
ED
Rakesh Ahuja
Transfer
Chidambaram

More Telugu News